Actress Honey Rose: ఎర్నాకులం పోలీసులకు ఫిర్యాదు.. 27 మంది పై కేసు..! 1 d ago
ఓ వ్యాపారవేత్త తనను వేధిస్తున్నారని నటి హనీ రోజ్ ఇటీవలే ఓ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో కొందరు తనకు అసభ్యకర కామెంట్లు చేస్తున్నారని తాజాగా ఆమె ఎర్నాకులం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కామెంట్లకు మానసిక వేధింపులకు గురైనట్లు ఆమె పేర్కొన్నారు. ఈమేరకు 27మంది పై ఎర్నాకులం పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసారని స్థానిక పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.